English | Telugu

షారుక్‌తో షాక్ ఇచ్చిన సిరి హనుమంత్!

షారుక్‌తో షాక్ ఇచ్చిన సిరి హనుమంత్!

 


తాజాగా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్'.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎంతోమంది తమిళ్, హిందీ యాక్టర్స్ ఉన్నారు. కాగా తెలుగు యాక్టర్స్ కూడా కొందరు ఉన్నారు. అందులో సిరి హనుమంత్ ఒకరు. షారుక్ ఖాన్, సిరి హనుమంత్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. ఇది తనకెంతో స్పెషల్ అంటూ సిరి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తను షారుక్ ఖాన్ ఫ్యాన్ అని ఒక ఫ్యాన్ గర్ల్ గా ఇది తనకి చాలా సంతోషానిచ్చిందంటూ, ఇది ఎప్పటికీ మర్చిపోలేనని సిరి ఆ పోస్ట్ లో చెప్పింది. కాగా‌ శ్రీహాన్ తనకి ట్యాగ్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో జవాన్ మూవీ ఉందనే విషయం అందరికి తెలిసిందే కాగా ఇన్ స్టాగ్రామ్ లో సిరి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సిరి హనుమంత్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బ్యూటీ. బిగ్ బాస్ సీజన్-5 లో ఫైనలిస్ట్ వరకు వచ్చి వెనుతిరిగింది‌. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన ఫ్యాన్ బేస్ మాములుగా ఉండేది కాదు. ప్రతీ వారం తనే టాప్ లో ఉండేది. టాస్క్ లో,  గేమ్స్ లో యాక్టివ్ గా ఉండేది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తో తను చనువుగా ఉంటూ వచ్చేది. దాంతో తనకి నెగెటివిటి పెరిగి బయటకు వచ్చేసింది.

సిరి బిగ్ బాస్ కు వెళ్ళేకంటే ముందు నుండి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సెలెబ్రిటి లిస్ట్ లో చేరింది. దాంతో వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన సిరి.. ఓటిటి వెబ్ సిరీస్ లో శ్రీహాన్ తో కలిసి చేస్తున్నట్టుగా ముందుగానే చెప్పింది. కాగా జీ5 లో రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'పులి-మేక' వెబ్ సిరీస్ లో సిరి ముఖ్యపాత్రని పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీహాన్ తో రిలేషన్ లో ఉన్న సిరి.. వెబ్ సిరీస్ లతో, షార్ట్ ఫిల్మ్ లతో బిజీగా ఉంటుంది.