English | Telugu

మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో ఫైట్స్ చేయడట..!

మహేష్ బాబుకు క్లాస్ తో పాటు మాస్ లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ముఖ్యంగా పోకిరి, దూకుడు లాంటి సినిమాలతో మాస్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు మహేష్. డ్యాన్స్ పరంగా మహేష్ ఫర్లేదనిపించినా, ఫైట్స్ లో మాత్రం సూపర్ స్టార్ కు తిరుగులేదు. కానీ మహేష్ సినిమాలో అసలు ఫైట్సే లేవంటే ఎలా ఉంటుంది..? బహుశా ఇప్పటి వరకూ మహేష్ ఏ సినిమాలోనూ ఫైట్స్ లేకుండా లేవు. ఆఖరికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న బ్రహ్మోత్సవంలో మాత్రం, ఎలాంటి ఫైట్స్ లేవనే ఒక వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే ప్రయత్నంలో, శ్రీకాంత్ అసలు ఫైట్స్ లేకుండా సినిమా నడిపించేశాడని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ హంగుల్లో ఉండే ఐటెం సాంగ్, ఫైట్ సీక్వెన్స్ లేకుండా హిట్ కొట్టాలంటే, ఊపిరి లా చాలా మంది పట్టున్న కథ ఉండాలి. మరిప్పుడు బ్రహ్మోత్సవం కథ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందా..? ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ప్రశ్నలకు జవాబులు ఆసక్తికరం. కాగా మే 7న శిల్పకళా వేదికలో బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఆరోజే దొరుకుతాయేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.