English | Telugu
మహేష్‌పై అలిగిన శ్రీనువైట్ల
Updated : Jul 20, 2015
మహేష్ - శ్రీనువైట్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన దూకుడు రికార్డుల దుమ్ము దులిపింది. ఆ తరవాత వచ్చిన ఆగడు రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం శ్రీనువైట్లని బాగా ఇబ్బంది పెట్టింది. ఎలాగైనా మహేష్‌తో మరో సినిమా తీసి, లెక్క సరిచేయాలని శ్రీనువైట్ల ధృడ నిశ్చయంతో ఉన్నాడు. అయితే... శ్రీనువైట్ల ఆశలపై మహేష్ నీళ్లు జల్లేలా కనిపిస్తున్నాడు.
ఎందుకంటే ఆగడు వైఫల్యంనుంచి మహేష్ ఇంకా తేరుకోలేకపోతున్నాడు. తాజాగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌లోనూ ఆ ఫ్లాన్‌ని గుర్తు చేశాడు. చివరి సారి మిమ్మల్ని నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి అని అభిమానుల్ని కోరాడు. అయితే ఆ సమయంలో శ్రీనువైట్ల కూడా అక్కడే ఉండడం విశేషం. మరో సినిమా వేడుకలో తన సినిమాగురించి మాట్లాడడం.. శ్రీనువైట్లని ఇబ్బంది పెట్టిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని.. శ్రీనువైట్ల బాధపడుతున్నాడట. 'నా తప్పుంటే..' అని అనడం వెనుక అర్థం.. ఇందులో నా తప్పేం లేదు అని చెప్పడమే అని... శ్రీను భావిస్తున్నాడట. ఆ మాట వెనుక అన్ని అర్థాలున్నాయా?? మొత్తానికి ఓ చిన్న వ్యాఖ్య ఓ దర్శకుడి మనసు నొప్పించేలా చేసింది. అయినా సరే.. ఓ సూపర్ హిట్ కథతో.. మహేష్ దగ్గరకు వెళ్తానని శ్రీను చెబుతున్నాడట.