English | Telugu

బాబోయ్...శ్రీమంతుడికి తెలుగు రాదంట

మహేశ్ బాబు డైలాగు చెబితే థియేటర్లలో విజిళ్లు మోతెక్కుతాయి…. తెలుగులో అతను నటించిన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పాయి. ఆయన నోట పలికితే డైలాగ్ లకు మరింత పవర్ వస్తుందని అంటారు. అంతగా పేరు తెచ్చుకున్న మహేశ్ బాబు తెలుగు డైలాగులు ఎలా చెబుతారో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

మహేశ్ బాబుకు తెలుగు మాట్లాడడం మాత్రమే వచ్చు… రాయడం, చదవడం అస్సలు రాదట. స్క్రిప్టు చూసి చదివి డైలాగు చెప్పమంటే ప్రిన్స్ నోరు పెగలదట. అవును… తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశే స్వయంగా ఈ సంగతి చెప్పాడు. దర్శకులు చెప్పిన డైలాగులు విని చెప్తాడట. ఎంత పెద్ద డైలాగ్ లేదా పేజిలు ఉన్నా దర్శకులు చెప్పింది వినడమే అలవాటు అని మహేశ్ చెబుతాడట. మహేశ్ కు తెలుగు రాకపోవడానికి కారణం ఆయన చెన్నైలో పుట్టిపెరగడమేనట. ఆయన పుట్టినప్పటినుంచి 23 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. అక్కడే చదువుకున్నారు. అదీ కారణం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.