English | Telugu

రేపు ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వనున్న మహేష్..!

టాలీవుడ్ సినీజనాల చూపులన్నీ ఇప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం పైనే ఉన్నాయి. ఇప్పటికే రోజుకో స్టిల్ తో, మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా టీం, రేపు మహేష్ ఫ్యాన్స్ కు మరో కానుక అందించబోతోంది. ఆల్రెడీ మోషన్ పోస్టర్ కు మంచి ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో, అంతే ఉత్సాహంగా రేపు బ్రహ్మోత్సవం టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల అండ్ కో. ఈ విషయాన్ని తమ ఫేస్ బుక్ లో అభిమానులతో పంచుకున్నారు. చాలా కాలంగా ఊరిస్తున్న బ్రహ్మోత్సవం టీజర్ రిలీజ్ అవుతుందంటే మహేష్ ఫ్యాన్స్ కు శుభవార్తే. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 7న మూవీ ఆడియోను శిల్పకళావేదికలో నిర్వహించబోతున్నారు. క్షణం, ఊపిరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన పివిపి బ్యానర్, బ్రహ్మోత్సవం తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. కాగా సూపర్ స్టార్ రజనీ నటించిన కబాలీ టీజర్ ను కూడా రేపే రిలీజ్ చేస్తుండటం విశేషం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.