English | Telugu

లయన్ గర్జిస్తుందా?

నందమూరి అభిమానులు సంబరాల్లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్టైన సింహా, చరిత్ర తిరగరాసిన లెజెండ్ తర్వాత.... వస్తోన్న సినిమా కావడంతో లయన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేవలం అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ లయన్ పై భారీ అంచనాలున్నాయి.

నందమూరి నటసింహంగా పిలుచుకునే బాలయ్యబాబుకు సింహం సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. తన టైటిల్ లో సింహం ఉంటే బాక్సాఫీస్ వద్ద గర్జిస్తాననే నమ్మకం. ఇది నిజమే అన్నట్టు గతంలో వచ్చిన బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా ఇలా అన్నీ ఆ కోవకు చెందినవే. దీంతో కాస్త రూట్ మార్చి తెలుగు సింహాన్ని లయన్ గా మార్చేశాడన్నమాట.

బాలయ్యకు మరో కలిసొచ్చే అంశం మణిశర్మ. నందమూరి హీరో కెరీర్లో మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన దాదాపు అన్ని ఆడియోలు హిట్టవడంతో పాటూ సినిమాలు కూడా ఘనవిజయాన్నందుకున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు పాటలు ఇప్పటికీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తున్న లయన్ ఆడియోకి కూడా మంచి స్పందనే వచ్చింది.

బాలకృష్ణ డబుల్ రోల్ కూడా ఈ మధ్య కాసుల వర్షం కురిపిస్తోందనే డిస్కషన్ జోరందుకుంది. సింహా, లెజెండ్ ఈ రెండింటిలోనూ ద్విపాత్రాభినయం చేసి దుమ్ములేపాడు. లేటెస్ట్ మూవీ లయన్ లోనూ ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. మరి ఈ మాటల్లో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ ప్రస్తుతం బాలయ్యకు డబుల్ రోల్ కలిసొచ్చే అంశమే.

పైవన్నీ ఒకెత్తైతే.....హీరోయన్ సెంటిమెంట్ మరొఎత్తు. లయన్ కు హీరోయిన్ దొరకలేదో...లేదా కావాలనే రాధికా ఆప్టేను రిపీట్ చేస్తున్నారో తెలీదు కానీ... అమ్మడు నటసింహానికి కలిసొస్తుందని అంటున్నారంతా. రెండువారాలు సినిమా థియోటర్లో ఉండడం కష్టమైన ఈ రోజుల్లో ఎమ్మిగనూరు థియోటర్లో 365 రోజులు ఆడి సంచలనం సృష్టించింది లెజెండ్. అందుకే మళ్లీ రాధికపైనే బాలయ్య మనసుపడ్డాడట.

అయితే అబ్బాయ్ హీరోయిన్స్ (త్రిష) బాబాయ్ కి కలసిరారని, కొత్త దర్శకుడు కిక్ ఇవ్వడనే నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నా....నందమూరి ఫ్యాన్స్ మాత్రం లయన్ భారీ విజయం అందుకుంటుందని అని ఫిక్సైపోయారు. మరి... చరిత్ర సృష్టించాలన్నా మేమే...దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్న బాలకృష్ణ...లెజండ్ రికార్డ్ ని తిరగరాస్తాడేమో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.