English | Telugu

‘లింగా’ సెన్సార్ రిపోర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లింగ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నట్లు ఆయన కుమార్తె సౌందర్య ట్విటర్ ద్వార తెలియజేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా ‘U’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన తండ్రి పుట్టినరోజు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు మూడువేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 50 నిమిషాలని వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద నిడివి తో సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులు ఏమైనా బోర్ ఫీలవుతారా అనే విషయం పై దర్శకుడు రవికుమార్, రజినీకాంత్ లు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.