English | Telugu
చెన్నైకి సపోర్ట్ గా టాలీవుడ్ సింగర్స్
Updated : Dec 11, 2015
ఆనందంగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్న చెన్నై ప్రజల్ని భారీ వరదలు నిరాశ్రయులుగా మార్చేశాయి. ఇటువంటి సమయంలో వారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటిచెప్పేందుకు ఎందరో ముందుకొచ్చారు. అక్కడి స్థానిక ప్రజలే కాకుండా తెలుగు ప్రజలు సైతం తమవంతు సహాయం అందిస్తున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు కూడా ‘మేమున్నామంటూ’ ముందుకొచ్చి, విరాళాలు ఇవ్వడమే కాకుండా సామాన్య ప్రజలతోపాటు సహాయ చర్యల్లోనూ పాల్గొంటున్నారు. తెలుగు హీరోలతో పాటు లేటెస్ట్ గా తెలుగు సింగర్స్ కూడా చెన్నై ప్రజలికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. 'Let's Support CHENNAI' అనే పేరుతో ఓ వీడియో సాంగ్ ని రూపొందించి చెన్నై కోసం 'SPB Fans Charitable Foundation' ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. జోస్యభట్ల గారు ఈ పాటకు సంగీతాన్ని అందించి, నిర్మించారు. తెలుగువన్ కూడా ఈ సహాయ కార్యక్రమంలో భాగసామ్యం అయ్యింది. మీరు కూడా ఈ వీడియో చూసి మీ వంతు సహాయాన్ని చెన్నై ప్రజలకి అందించండి. మీరు విరాళాలు పంపవల్సిన డిటైల్స్:
SPB Fans Charitable Foundation
Bank: ICICI Bank, Anna Nagar West Extension Branch
Acct No: 039501002062
IFSC Code: ICIC0000395
MICR: 600229028
Bank Address: No.13 School Road, Anna Nagar West Extension, Chennai 600101