English | Telugu

బెంగాల్ టైగర్ లో పవర్ స్టార్ జపం!!

బెంగాల్ టైగర్ లో పవన్ కళ్యాణ్ ని వీలు చిక్కినపుడల్లా బాగానే మోశాడట సంపత్ నంది. ‘సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన స్టార్ రాడనుకున్నాం.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలేదా’’ ఇదీ బెంగాల్ టైగర్ సినిమాలో ఓ డైలాగ్. పవన్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికే సంపత్ ఈ డైలాగ్ రాసినట్లున్నాడు. సినిమాలో పవన్ రెఫరెన్సులు ఇంతటితో ఆగిపోలేదు. ‘‘మొన్న ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున ఓ స్టార్ ప్రచారం చేస్తే జనాలు ఓట్లు గుద్దేయలేదూ’’ అంటూ పవన్ పొలిటికల్ పవర్ మీద కూడా ఓ డైలాగ్ పేల్చాడు సంపత్. ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ పేరడీతో పవన్ ను మరోసారి గుర్తుకు తెచ్చాడు సంపత్. మొత్తానికి రవితేజ సినిమాలో ఛాన్స్ దొరికినప్పుడల్లా పవర్ స్టార్ జపం చేశాడు సంపత్ నంది. మరి ఈసారైనా పవన్ కరుణిస్తాడో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.