English | Telugu

బోర్ కొట్టేసిన పాపలు...టాప్ ప్లేస్ ఎవరిది..?

సినిమా కథ ఎంత బాగున్నా, హీరోయిన్ లేకపోతే, సగటు తెలుగు ప్రేక్షకుడు సినిమాను ఏదో వెలితిగానే ఫీలవుతాడు.. అందుకే, తెలుగులో ఎంతటి ప్రయోగాత్మక సినిమాలొచ్చినా, వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో, అవసరం లేకపోయినా హీరోయిన్ పాత్రను సృష్టిస్తుంటారు మన దర్శక నిర్మాతలు..కానీ సమస్యేంటంటే, మన ప్రేక్షకులు ఒకే హీరోయిన్ ను కూడా ఎక్కువ కాలం చూడలేరు... ఒకప్పుడు మహానటి సావిత్రి లాంటి వాళ్లను ఎన్ని సంవత్సరాలైనా,కన్నార్పకుండా చూసేవారు.. కానీ అది గతం..ఇప్పుడు కథానాయికకు గట్టిగా చెప్పుకుంటే, ఆరేడేళ్లకు మించి స్పాన్ ఉండట్లేదు.


నిన్నటి తరంలో సిమ్రాన్,ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్లు ఒక ఊపు ఊపారు.. వాళ్ల తర్వాత నయనతార,త్రిష,శ్రియ బ్యాచ్ కూడా బాగానే దశాబ్దం పాటు మ్యానేజ్ చేశారు..వీళ్లకూ ఏజ్ బారైపోవడంతో, తర్వాతి జనరేషన్ కాజల్,సమంత,అనుష్క,తమన్నాలు ఫామ్ లోకి వచ్చారు..ఇప్పుడు వీళ్ల జర్నీకూడా స్పీడ్ తగ్గింది.ప్రేక్షకుడు సరికొత్త అందాల్ని కోరుకుంటున్నాడు. రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి లాంటి వాళ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం అదే..మరి రాబోయే రెండు మూడేళ్లలో నెంబర్ గేమ్ లో టాప్ ప్లేస్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.