English | Telugu

తెలుగులో మ‌రో రొమాంటిక్ సినిమా

క‌ళాత్మ‌క చిత్రం అంటే అర్థం మారిపోయిందిప్పుడు. ప‌డ‌గ్గ‌ది వ్య‌వ‌హారాలు సైతం కెమెరాలో బంధించి.. దానికి ముందూ వెనుక ఎమోష‌న‌ల్ సీన్లు జోడించి... ర‌స‌వ‌త్త‌ర‌మైన సందేశం ఇవ్వ‌డ‌మే ఆర్ట్ సినిమా అనే భావ‌న‌లో ఉన్నారు కొంత‌మంది ద‌ర్శ‌కులు. యూ ట్యూబ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ల‌జ్జ సినిమా ట్రైల‌ర్ చూసినా అదే అనిపిస్తోంది. ఇది మ‌సాలాతో నిండిన సందేశాత్మ‌క సినిమా...అని అర్థ‌మైపోతోంది. 1940 ఓ గ్రామం సినిమాతో జాతీయ అవార్డు పొందిన న‌ర‌సింహ నంది తీసిన రెండో సినిమాఇది. చ‌లం భావాల్ని ఆద‌ర్శంగా తీసుకొని ఈ సినిమా రూపొందించా అంటున్నాడు ద‌ర్శ‌కుడు.

భ‌ర్త‌తో ఏమాత్రం సుఖ‌ప‌డ‌ని భార్య త‌న మాజీ ప్రియుడి పంచ‌న చేరి కోరిక‌ల్ని తీర్చుకోవ‌డం అన్న పాయింట్‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. ఆ అంశాన్నే కాస్త పోయెటిక్ గా తెర‌కెక్కించాల‌న్న ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. `నా సినిమాల‌కు అవార్డుల‌తో పాటు డబ్బులు కూడా రావాల‌నే ఈ సినిమా తీశా` అని నిర్మొహ‌మాటంగా చెబుతున్న న‌ర‌సింహా నంది.. ఈ సినిమాలో కావ‌ల్సిన‌న్ని మ‌సాలా స‌న్నివేశాలు పొందుప‌రిచాడ‌న్న విష‌యం ప్ర‌చార చిత్రంలోనే తెలిసిపోతోంది. మ‌ధుమిత హాట్ హాట్ అందాల‌తో గాలం వేయ‌డానికి త‌న ద‌గ్గ‌ర అస్త్రాల‌న్నీ సిద్ధం చేసుకొన్నాడు. కామం - స్నేహం - ప్రేమ ఈ పాయింట్‌తో సినిమా తీసినా... దృశ్యాల్లో మాత్రం విచ్చ‌ల‌విడిత‌నం క‌నిపిస్తోంది. వీటికి ఈ `జాతీయ అవార్డు గ్ర‌హీత‌` ఏం స‌మాధానం చెబుతాడో, సెన్సార్ ని దాటుకొని ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాడో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.