Read more!

English | Telugu

డ్రంకన్‌డ్రైవ్‌‌లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిన్న రాత్రి  పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రశాంత్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రముఖ బుల్లితెర నటుడు భరణి పోలీసులకు పట్టుబడ్డాడు. భరణి తాగి కారు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్లకు దొరికిపోయాడు. ఆయన 41 శాతం మేర మద్యం సేవించినట్లు బ్రిత్ ఎనలైజింగ్‌లో తేలింది.  కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కారును సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. భరణి తెలుగులో ప్రముఖ  సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు.