English | Telugu

ఈనెల తెలుగువన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'కుడి ఎడమైతే'

ఫిల్మ్ మేకర్స్ కావాలనుకునే చాలా మంది అవకాశాల కోసం వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు!!అవును మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్స్ ట్రెండే నడుస్తోంది. సినిమాలు తీయటానికి కుదరని వాళ్ళు,ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తమ లోని టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఓ వ్యక్తి సినిమా డైరక్టర్ అవ్వాలంటే అసెస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించనవసరం లేదని, ఓ కథ చెప్పాలన్న విపరీతమైన ఆసక్తి, ఆ కథపై స్పష్టత వుంటే చాలని తెలుగువన్ నమ్ముతోంది. దాని కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ భాష లో తీసిన షార్ట్ ఫిల్మ్ అయిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనవొచ్చు.

ప్రతి నెలలాగే ఈ సారి తెలుగువన్ షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ కు పెద్ద సంఖ్యలో షార్ట్ ఫిల్మ్స్ పంపించారు. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి నుంచి 15 మార్చి వరకు తెలుగువన్ వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ లో ' Kudi Yedamaithe' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు Seshu MJ కి తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠ౦నేని రవిశంకర్ గారు పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. యువతీయువకులు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.