English | Telugu

వారం పాటు ఏం తినలేదు.. బాలకృష్ణ తో పెట్టుకుంటే అదే పరిస్థితి 

ఐదు దశాబ్దాల నుంచి నటనని తన ఊపిరిగా చేసుకుంటూ వస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ(balakrishna)పేరుకి ఎన్టీఆర్(ntr)వారసుడు అనే కానీ వారసత్వపు ఛాయలు పడకుండా తన కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. బడా హీరోలు సైతం బాలయ్య చెప్పినట్టుగా డైలాగ్ ని మేము చెప్పలేమని అంటారంటే సినిమా పట్ల బాలయ్య డిక్షనరీ ని అర్ధం చేసుకోవచ్చు. మరి అలాంటి నట సింహం గురించి అగ్ర దర్శకుడు కోదండ రామిరెడ్డి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.

బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబో లో మొత్తం 13 చిత్రాలు తెరకెక్కాయి. అనసూయమ్మ గారి అల్లుడు ఫస్ట్ మూవీ. విడుదలైన అన్ని చోట్ల ఘన విజయాన్ని సాధించి ఆ ఇద్దరి కాంబో ని రిపీటెడ్ కాంబో గా చేసింది. దీంతో బాలయ్య అభిమానులు ప్రేక్షకులు కూడా ఎన్నో భారీ అంచనాలతో ఆ ఇద్దరి మూవీ కోసం చూస్తుండే వాళ్ళు. ఈ క్రమంలో 1993 లో వచ్చిన మూవీ నిప్పురవ్వ(nippu ravva)ఈ సినిమా విషయంలోనే కొండరామిరెడ్డి బాలయ్య మీద కొన్ని వ్యాఖ్యలు చేసాడు. హీరో పాత్ర నిరాహార దీక్ష చేసే సీన్ ఒకటి ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఏం తినకుండా ఆ దీక్ష కొనసాగుతుంది. దీంతో నీరసం వచ్చి హీరో ఫేస్ డల్ గా కనపడాలి. సినిమా కాబట్టి కెమెరా తో మ్యానేజ్ చెయ్యవచ్చు. కానీ బాలయ్య మాత్రం ఒప్పుకోలేదు. నిజంగానే వారం రోజుల పాటు ఏం తినకుండా కేవలం జ్యూస్ లు లాంటివి మాత్రమే తీసుకొని ఆ సీన్ ని పూర్తి చేసాడని కోందండ రామిరెడ్డి చెప్పారు.

అలాగే బాలయ్య గురించి మరికొన్ని విషయాలని కూడా చెప్పారు.బాలయ్య కి అగ్ర నటుడు అనే గర్వం ఉండదని, ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తాడని అదే విధంగా గోల్డెన్ స్పూన్ తో పుట్టాననే గర్వం కూడా లేదని చెప్పుకొచ్చారు. అలాగే సినిమా అంటే బాలయ్య కి విపరీతమైన పిచ్చి అనే విషయాన్నీ కూడా వెల్లడి చేసారు. భలే దొంగ, నారి నారి నడుమ మురారి ,ధర్మక్షేత్రం,రక్తాభిషేకం,తిరగబడ్డ తెలుగుబిడ్డ,భానుమతి గారి మొగుడు, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు,ముద్దుల మొగుడు, యువరత్న రాణా వంటి చిత్రాలు వచ్చాయి.దాదాపుగా అన్ని కూడా విజయంతమైన చిత్రాలే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.