English | Telugu

నువ్వా? నేనా?.. కిష్కింధపురి, మిరాయ్‌.. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్‌?

ఈ వారం ఇద్దరు యంగ్‌ హీరోలు పోటీ పడుతున్నారు. సెప్టెంబర్‌ 12న బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘కిష్కింధపురి’, తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘మిరాయ్‌’ చిత్రాలు విడుదలయ్యాయి. కిష్కింధపురికి కౌశిక్‌ పెగల్లపాటి దర్శకుడు కాగా, మిరాయ్‌ చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని రూపొందించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌, తేజ సజ్జా ఇద్దరూ తమ సినిమాలపై పూర్తి కాన్ఫిడెన్స్‌ ఉన్నారు. దీంతో వీరి మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది. రిలీజ్‌కి ముందు రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగాయి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్‌ జోనర్స్‌ కావడంతో రెండూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

మిరాయ్‌ చిత్రంలో మంచు మనోజ్‌ మరో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాను అశోకుడు, 9 పుస్తకాలు నేపథ్యంలో కొంత మైథలాజికల్‌ టచ్‌తో రూపొందించారు. కిష్కింధపురి విషయానికి వస్తే.. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై థ్రిల్లర్‌ జానర్‌లో నిర్మించారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీమియర్స్‌ ఒకరోజు ముందే పడ్డాయి. ఇప్పటివరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన కిష్కింధపురి ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టిందని తెలుస్తోంది. కథ, కథనం బాగానే ఉందని, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు. మిరాయ్‌ విషయానికి వస్తే.. మైథలాజికల్‌ టచ్‌తో ఒక విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని అప్రిషియేట్‌ చేస్తున్నారు. కథ బాగున్నప్పటికీ కథనంలో కొన్ని లోపాలు కనిపించాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్‌గా నిలుస్తుంది అని చెప్పడానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ రెండూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు కావడంతో బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించే ఛాన్స్‌ ఉంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.