English | Telugu
ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Updated : Jul 25, 2024
హాలీవుడ్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఆ గ్రాఫిక్స్ , విజువల్స్, ఫైటింగ్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అందులోను కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకుడిని అలా కూర్చోబెట్టేస్తాయి.
ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా అదే థీమ్ ని కొనసాగిస్తూ ' కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ( Kingdom of the Planet of the Apes ) మూవీ మే 10 న థియేటర్లలో రిలీజైంది. ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్, హెచ్. మేసి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో భారీగా వసూళ్ళని రాబట్టింది. దీనికి వెస్ బాల్ దర్శకుడు. ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం మేకర్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే ప్రకటన రిలీజ్ చేశారు.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అగస్ట్ 2 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా చెప్పారు. 1350 కోట్లతో రూపొందించిన ఈ సినిమా 3,300 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకి ఐఎమ్ డీబీ లో 7.2 రేటింగ్ ఉంది. ఈ ఏడాది రిలీజైన సినిమాల లిస్ట్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్-10 లో ' కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఉండటం విశేషం. ఈ మూవీ ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలని ఓటీటీ ప్రియులు అత్యధికంగా వీక్షిస్తారు. మరి అలాంటి వారికోసం ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.