English | Telugu
ఆ కేరళ నిర్మాత గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య..!
Updated : May 5, 2016
కొద్ది రోజుల క్రితం తన సినిమా రషెస్ చూసి మళయాళ నిర్మాత, నటుడు అజయ్ కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరూ మర్చిపోక ముందే, మరో దుర్ఘటన చోటు చేసుకుంది. అజయ్ గర్ల్ ఫ్రెండ్ వినీతా నాయర్ తన అపార్ట్ మెంట్ లో సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖ రాసి పెట్టింది. అజయ్ మరణాన్ని భరించడం తనవల్ల కావడం లేదని, ఆ ఒత్తిడిని భరించలేకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానని, లేఖలో రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. 28 ఏళ్ల వినీత ఫాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. సాక్ష్యాధారాలను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మళయాళ సినీ పరిశ్రమకు ఈ సూసైడ్ లు దిగ్భ్రాంతి కలిగించాయి. పలువురు మళయాళ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.