Read more!

English | Telugu

క్యాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్.. ‘సినిమాలకు గుడ్ బై.. జాబ్ చేసుకుంటా’!

అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ మొట్టమొదటి సారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తాను సినిమా ఇండస్ట్రీకి రాకముందే క్యాస్టింగ్ కౌచ్ గురించి కొంత మంది హీరోయిన్స్ తనకు చెప్పారని కీర్తి సురేష్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వివరించారు. ‘‘అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది మనం నడుచుకునే విధానం బట్టి మనకు ఎదురవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది నాకు ఎదురు పడలేదు. ఇక ముందు కూడా పడదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కమిట్ మెంట్ ఇస్తేనే నీకు సినిమా ఆఫర్ ఇస్తాను అని అడిగితే... నేను ఆ టైప్ కాదు అని వారికి చెప్తాను... వారు ఇచ్చే ఆఫర్‌ను కూడా సున్నితంగా తిరస్కరిస్తానే తప్ప కమిట్‌మెంట్ మాత్రం ఇవ్వను. అవసరమైతే సినిమాలకు గుడ్ బై చెప్పి జాబ్ చేసుకుంటాను’’ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది ఈ బూరె బుగ్గల సుందరి. 

ప్రస్తుతం కీర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్‌పై ‌చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ ‘దసరా‘ చిత్రంలో న్యాచురల్ స్టార్ నానికి జోడీగా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా కూడా నటిస్తోంది. ఇటు తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది కీర్తి.