Read more!

English | Telugu

'యశోద' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

సమంత టైటిల్ రోల్ పోషించిన రీసెంట్ మూవీ 'యశోద'. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

డిసెంబర్ 9 నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'యశోద' స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డిసెంబర్ 9 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో హిట్ గా నిలిచిన 'యశోద' ఓటీటీలోనూ అదేస్థాయిలో ఆదరణ పొందుతుందేమో చూడాలి.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.