English | Telugu

కేన్స్ ఫెస్టివల్ కు బంక్ కొట్టేసిన కత్రినా కైఫ్..!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలో ఆస్కార్ తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్ గా భావిస్తారు నటీనటులు. ఇక్కడ రెడ్ కార్పెట్ పై నడవడమంటే అదొక ప్రెస్టీజియస్ అక్చీవ్ మెంట్ గా ఫీలౌతారు. అయితే ఇలాంటి గొప్ప అవకాశానికి కత్రినా కైఫ్ మాత్రం మిస్ కొట్టింది. ఇప్పటికే తను అంగీకరించిన చిత్రాల కమిట్ మెంట్స్ కోసమే ఈ సారి కేన్స్ కు రాలేకపోతున్నట్టు వివరణ ఇచ్చింది కత్రినా కైఫ్. లోరియల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన కత్రినా, లాస్ట్ ఇయర్ కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై ఇరగదీసింది. వరసగా రెండో ఏడాది కూడా కేన్స్ కు హాజరౌతుందని అందరూ భావించినా, ఈ విధంగా ఛాన్స్ కోల్పోయింది కత్రినా. ప్రస్తుతం మాజీ ప్రేమికుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ‘జగ్గా జాసూస్‌’, సిద్దార్థ్‌ మల్హోత్రాతో ‘బార్‌ బార్‌ దేఖో’ సినిమాలు కత్రినా ఎకౌంట్ లో ఉన్నాయి. ఇప్పటికే చాలా సార్లు ఈ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య, ఆమెతో పాటు సోనమ్ కపూర్ లు కేన్స్ రెడ్ కార్పెట్ పై మెరవనుండటం విశేషం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.