English | Telugu

పాకిస్థాన్ నిర్వహించే ఈవెంట్ కి స్టార్ హీరో! హెచ్చరికలు జారీ 

2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'ప్యార్ కా పంచనామా'తో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో 'కార్తీక్ ఆర్యన్'(Kartik Aaryan). ఆ తర్వాత అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనకంటు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా 'చందు ఛాంపియన్, భూల్ భూలయ్య పార్ట్ 3 ' వంటి విభిన్న చిత్రాలతో వరుస విజయాల్ని అందుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆషీకీ పార్ట్ 3 ' చేస్తున్నాడు. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.

ఆగస్టు 15న అమెరికాలోని హ్యూస్టన్‌లో జరగనున్న 'ఆజాదీ ఉత్సవ్’(Azadi Utsav)కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ పాల్గొనబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న 'ఆజాదీ ఉత్సవ్' ని 'అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్' అనే సంస్థ నిర్వహించబోతుంది. ఈ సంస్థ యజమాని 'షౌకత్ మారేడియా' పాకిస్తానీ మూలాలు కలిగిన వ్యక్తి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫెడరేషన్ ఆఫ్ సినిమా వర్కర్స్ కాన్ఫెడరేషన్ ఈ విషయంపై స్పందిస్తు పాకిస్థాన్ కి సంబంధించిన వ్యక్తి నిర్వహించే కార్యక్రమంలో కార్తీక్ పాల్గొనకూడదని, ఒకవేళ పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తు ఒక లేఖ కూడా జారీ చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ కూడా స్పందిస్తు దేశ ప్రయోజనాల దృష్ట్యా కార్తీక్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం సముచితం కాదని పేర్కొంది.

ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతమైన 'పహల్గామ్'(Pahalgam)లోకి పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించి,మన దేశ పర్యాటకులని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పాకిస్థాన్ కి చెందిన కళాకారులని, భారతీయ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఓటిటి వేదికగా కూడా పాకిస్థాన్ మూలాలు ఉన్న సినిమాల్ని సైతం నిషేధించింది.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.