English | Telugu

యన్ టి ఆర్ కంత్రీ తమిళంలో పోకిరి పయ్య

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటించగా, హంన్సిక మోత్వానీ హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై,అశ్వనీదత్ నిర్మించిన చిత్రం "కంత్రీ". ఈ "కంత్రీ" చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఈ "కంత్రీ" చిత్రాన్ని తమిళంలో "పోకిరి పయ్య" పేరుతో అనువదిస్తున్నారు...అదేనండీ డబ్బింగ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర టెలీ ఫిలింస్ పతాకంపై పి.శారదా రెడ్డి "కంత్రీ" చిత్రాన్ని "పోకిరి పయ్య" పేరుతో తమిళంలోకి డబ్ చేస్తుండగా, ఇండియన్ ఇమేజెస్ సంస్థ అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేయనుందట.

యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మించగా ఇటీవల విడుదల్యాన "శక్తి" చిత్రాన్ని కూడా తమిళంలోకి "ఓం శక్తి" పేరుతో అనువదించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా యన్ టి ఆర్ కి మార్కెట్ ఉందనీ, సేలబులిటీ ఉండబట్టే అతని సినిమాలను తమిళంలోకి డబ్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.