English | Telugu

ఐక్యరాజ్య సమితిలో కాంతార ప్రదర్శన

ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద మన సినిమాలు నాన్‌స్టాప్‌గా సత్తా చాటుతున్నాయి. మొన్నటికి మొన్న ఆస్కార్‌ డయాస్‌ మీద రెండు సార్లు మనవాళ్ల సత్తా కనిపించింది. ది ఎలిఫెంట్‌ విస్సరర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ పిల్మ్ కి పురస్కారం దక్కింది. నాటు నాటు పాటకు ఆస్కార్‌ దక్కింది. లాస్‌ ఏంజెల్స్ నుంచి మనవారు ఇండియా చేరుకున్నారు.

ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ సంబరాలు తగ్గుతున్న వేళ, కాంతార టీమ్‌ అందిపుచ్చుకోవడానికి రెడీ అవుతోంది. ఐక్యరాజ్యసమితిలో కాంతార సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రిషబ్‌ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా కాంతార. 17 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డివైన్‌ బ్లాక్‌ బస్టర్‌ అనే పేరు తెచ్చుకుంది కాంతార సినిమా. అడివి బిడ్డలు. వాళ్ల నమ్మకాలు, అడివిని నమ్ముకున్న వారి జీవనవిధానం, వాటిని ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రశ్నించే తీరు, ఇలా చాలా విషయాల చుట్టూ తిరుగుతుంది కాంతార సినిమా. అడవిపుత్రుల హక్కుల గురించి కూడా పరోక్షంగా మాట్లాడింది ఈ సినిమా. ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోనూ ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు రిషబ్‌ శెట్టి. ఇందుకుగానూ ఆయన స్విట్జర్లాండ్‌కి ఆల్రెడీ చేరుకున్నారు. జెనీవాలోని కార్యాలయంలో ఇవాళ కాంతార సినిమాలో పర్యావరణాన్ని పరిరక్షించే అంశాల మీద మాట్లాడబోతున్నారు. ఇండియన్‌ సినిమా పర్యావరణ పరిరక్షణకు ఎలా తనవంతు సాయం చేస్తుందనే విషయం మీద కూడా చర్చ జరగనుంది.

పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్‌తోనే ఎన్టీఆర్‌ కొరటాల శివ జనతాగ్యారేజ్‌ కూడా తెరకెక్కింది. అప్పట్లో జనతాగ్యారేజ్‌ మేకర్స్ ప్రయత్నించి ఉంటే, జెనీవా కార్యాలయంలో ప్రదర్శించే ఛాన్స్ ఆ సినిమాకు కూడా దక్కి ఉండేది.మరోవైపు కాంతారకు ప్రీక్వెల్‌ సిద్ధమవుతోంది. ప్రీక్వెల్‌ని తప్పక ఆస్కార్‌ రేసులో నిలుపుతామని అన్నారు హోంబలే నిర్మాతలు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.