English | Telugu

‘కంగువా’ వచ్చేస్తోంది... ఇక ‘బాహుబలి2’ రికార్డ్స్‌కి ఎసరు తప్పదా?

ఈమధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో భారీ అంచనాలు ఏర్పరచుకున్న సినిమా ‘కంగువా’. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న స్టూడియోగ్రీన్‌, తెలుగులో భారీ చిత్రాలను నిర్మించే యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా మరో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సూర్యకు టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్‌ చెయ్యాలని మేకర్స్‌ భావిస్తున్నారు. లెక్కకు మించిన థియేటర్స్‌లో సినిమాను రిలీజ్‌ చేస్తే ఎంతో ఈజీగా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ప్రమోషన్స్‌ను స్పీడప్‌ చేయడమే కాకుండా ప్రీ రిలీజ్‌ వేడుకకు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కి ప్రభాస్‌ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యువి క్రియేషన్స్‌ అనేది ప్రభాస్‌ సొంత సంస్థ వంటిది. ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ కూడా పార్టిసిపేట్‌ చేస్తే సినిమా రేంజ్‌ మరోలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కంగువా ఖచ్చితంగా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు కలెక్ట్‌ చేస్తుంది. నేను చెప్పినట్టుగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది అనేందుకు సాక్ష్యంగా జీఎస్‌టీ బిల్లులను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తాను’ అని ప్రకటించారు. ఏ నిర్మాతకైనా తను తీసే సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, సూపర్‌హిట్‌ సాధిస్తుందని.. ఇలా రకరకాలుగా మాట్లాడడం మనం చూశాం. కానీ, రూ.2000 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా చెప్పుకునే ‘బాహుబలి2’ చిత్రం కూడా రూ.2000 వేల కోట్లు కలెక్ట్‌ చేయలేకపోయింది. మరి జ్ఞానవేల్‌రాజా ఏ ధైర్యంతో ఈ ఛాలెంజ్‌ చేశారు అనేది తెలియడం లేదు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25 భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జ్ఞానవేల్‌రాజా ఈ ఛాలెంజ్‌ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలా కాలం అయింది. కానీ, సినిమా పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు ఇంకా టైమ్‌ పడుతోంది. గతంలో పలుమార్లు ఈ సినిమా రిలీజ్‌ని వాయిదా వేశారు. ఎట్టకేలం నవంబర్‌ 14న సినిమాను రిలీజ్‌ చేస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు. సూర్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.