English | Telugu

బుడ్డోడికి కోపం వ‌చ్చింది..అందుకే రియాక్ట్ అయ్యాడు

నంద‌మూరి ఫ్యామిలీలో ఉన్న లుక‌లుక‌ల్ని ప్ర‌త్యేకంగా గుర్తు చేయ‌న‌వ‌స‌రం లేదు. నంద‌మూరి కుటుంబానికి సంబంధించిన సినీ వేడుక‌ల్లో ఈ విష‌యం బ‌హిర్గ‌తం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఉన్న వేడుక‌ల్లో.. మ‌రీ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. వేదిక‌పై ఎన్టీఆర్ ఉన్నా, జై బాల‌య్యా.. జై జై బాల‌య్య అంటూ బాల‌కృష్ణ‌ని అభిమానులు స్మ‌రిస్తుంటారు. అది.. ఎన్టీఆర్ కి కోపం తెప్పిస్తుంది. షేర్ ఆడియో వేడుక‌పై ఇదే దృశ్యం ఆవిష్ర్కృత‌మైంది.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన షేర్ ఆడియో ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్ హాజ‌ర‌య్యాడు. అక్క‌డ వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన బాల‌య్య అభిమానులు జై బాల‌య్య‌.. జై జై బాల‌య్య అంటూ ప‌దే ప‌దే గ‌ట్టిగా అర‌వ‌డం.. ఎన్టీఆర్‌కి చిరాకు తెప్పించింది. ఓ ద‌శ‌లో స‌డ‌న్‌గా మైకు అందుకొని.. `ఇది మ‌న ఫంక్ష‌న్ కాదు.. అభిమానులు శాంతించాలి` అంటూ కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఫ్యాన్స్ విన‌లేదు. స‌రి కదా, ఆ ఆరుపులు మ‌రింత ఎక్కువ‌య్యాయి. దాంతో ఎన్టీఆర్ మొహం చిన్న‌బుచ్చుకొన్నాడు.

అందుకే క‌ల్యాణ్‌రామ్ మాట్లాడుతూ అభిమానులు త‌మ‌ని వేరు చేసి మాట్లాడ‌డం భావ్యం కాద‌ని సూచించాడు. త‌మ దైవం ఎన్టీఆరే అని, వాళ్ల వార‌సుల్ని కూడా స‌మానంగా చూడాల‌ని గుర్తు చేశాడు. క‌ల్యాణ్ రామ్ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లోనే కాదు, అటు టీడీపీలోనూ చ‌ర్చ‌నీయాంశాల‌య్యాయి. బాల‌య్య‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ఎన్టీఆర్ అన్న‌య్య త‌రుపునుంచి ఇలా మాట్లాడించాడా? అని కూడా భావిస్తున్నారు. ఫ్యాన్స్ మ‌ధ్య చీలిక‌లొస్తే అది త‌న కెరీర్ కే మంచిది కాద‌ని ఎన్టీఆర్ భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే.. ఫ్యాన్స్ ని కూల్ చేయ‌డానికి క‌ల్యాణ్ రామ్ చేత ఇలా మాట్లాడించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి బాల‌య్య ఫ్యాన్స్ ఇప్పటికైనా ఎన్టీఆర్‌ని క‌రుణిస్తారా?? మ‌ళ్లీ హీరోలంతా ఏక‌మ‌వుతారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.