Read more!

English | Telugu

ప్రభాస్ కల్కి కి  కర్ణాటక తలుపులు ఓపెన్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి.  అన్ని కుదిరి ఉంటే ఈ పాటకి థియేటర్స్ దగ్గర మోత మోగిపోతూ ఉండాల్సింది.ఏం చేస్తాం  ఎలక్షన్స్ వల్ల మే 9 నుంచి  జూన్ 27 కి వాయిదా పడింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం జోష్ ఏ మాత్రం తగ్గటం లేదు.  సోషల్ మీడియాలో కల్కి సంబంధించిన బిజినెస్ వార్తలని చూస్తు డార్లింగ్ రేంజ్ ఇది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

ఇండియా వైడ్ గా కల్కి బిజినెస్ స్టార్ట్ అయ్యింది. పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పంపిణి హక్కుల కోసం    పోటీపడుతున్నాయి. ఎంత భారీ మొత్తం అయినా వెచ్చించి  కల్కి హక్కులని పొందుతున్నారు. ఇప్పుడు  కన్నడ వెర్షన్ కి సంబంధించిన  డీల్ లాక్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్   సొంతం చేసుకుంది.ఇందుకు గాను భారీ మొత్తమే చెల్లించినట్టు సమాచారం.  ఇక కర్ణాటక మొత్తం సదరు సంస్థ ద్వారానే కల్కి  రిలీజ్ కానుంది.ఈ విషయాన్ని అధికారకంగా సదరు సంస్థ తెలియచేసింది. అలాగే ప్రభాస్ సినీ కెరీర్ లోనే కన్నడ నాట అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికీ ప్లాన్ చేస్తున్నారు. కేజీయఫ్  స్టార్ యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నే  నిర్మిస్తుంది. దీన్ని బట్టి ఎంత ప్రతిష్టాత్మక సంస్థనో  అర్ధం చేసుకోవచ్చు. ఇక సూర్య  కంగువ ని కూడా  కర్ణాటక వ్యాప్తంగా  విడుదల చేస్తుంది

కల్కి లో ప్రభాస్ సరసన  దీపికా పదుకునే నటిస్తుండగా  దిశా పటాని ఒక ప్రత్యేక గీతంలో నటిస్తుంది.  యూనివర్సల్ హీరోలైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మహానటి ఫేమ్  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ 600 కోట్ల బడ్జట్ తో నిర్మించాడు.ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు వెయిటింగ్