English | Telugu

కిక్ దెబ్బ‌కు బుక్క‌యిన బుడ్డోడు

కిక్ 2 వ‌ల్ల సురేంద‌ర్‌రెడ్డి, ర‌వితేజ‌లు ఎంత న‌ష్ట‌పోయారో తెలీదు గానీ... ప్రొడ్యూస‌ర్ క‌ల్యాణ్ రామ్ మాత్రం చేతులు కాల్చుకొన్నాడు. రూ.25 కోట్ల‌లో తీయాల్సిన ఈ సినిమాకి రూ.40 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయ్యింద‌ట‌. అంటే... అక్క‌డే రూ.15 కోట్లు ఎగిరిపోయాయి. చివ‌ర్లో ఫైనాన్సియ‌ల్ స‌మ‌స్య‌లు రావ‌డంతో ఎన్టీఆర్ ఈ సినిమాని ఆదుకొన్నాడు. దాదాపు రూ.12 కోట్ల‌కు పూచీక‌త్తు ఇచ్చి.. ఈసినిమాని రిలీజ్ చేయించాడు. సినిమా విడుద‌ల అయ్యింది గానీ, డ‌బ్బులు వెన‌క్కి రాలేదు. దాంతో ఆరు కోట్లు త‌న సొంత డ‌బ్బు ఇచ్చి.. వ్య‌వ‌హారాన్ని సెటిల్ చేశాడు. అక్క‌డితో అయిపోలేదు.

ఈసినిమాని నైజాంలో విడుద‌ల చేసిన దిల్‌రాజుకి ఓ సినిమా ఫ్రీగా చేసి పెడ‌తా అని మాటిచ్చాడు. ఒక్కో సినిమాకీ దాదాపు రూ.8 కోట్ల పారితోషికం తీసుకొంటాడు ఎన్టీఆర్‌. అంటే కిక్ 2 వ‌ల్ల మ‌రో ఎనిమిది కోట్లు పోయిన‌ట్టే. అంటే కిక్ 2 వ‌ల్ల‌.. మొత్తం 14 కోట్ల న‌ష్టాన్ని భ‌రించాడ‌న్న‌మాట తార‌క్. ఇంకొంత‌మంది ఫైనాన్సియ‌ర్లు త‌మ బాకీలు తీర్చ‌మ‌ని క‌ల్యాణ్‌రామ్‌మీద‌, మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న ఎన్టీఆర్‌మీద ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని టాక్‌.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాన‌ని, ఆ సినిమా త‌ప్ప‌కుండా మీకే ఇస్తాన‌ని ఫైనాన్సియ‌ర్ల‌కు మాటిచ్చాడ‌ట క‌ల్యాణ్‌రామ్‌. అంటే.. అన్న‌య్య కోసం మ‌రో సినిమానీ ఎన్టీఆర్ చేసి పెట్టాల‌న్న‌మాట‌. త‌న‌కు ఏమాత్రం సంబంధంలేని సినిమాలో త‌ల‌దూర్చి..ఎన్టీఆర్ ఎంతలా ఇరుక్కుపోయాడో పాపం.. అంటూ.. టాలీవుడ్ జ‌నాలు విస్తుపోతున్నారు.