English | Telugu

జానీ మాస్టర్‌ విషయంలో రామ్‌చరణ్‌ అలా చేయడానికి రీజన్‌ ఏమిటంటే..?

- చరణ్‌తో జానీ మాస్టర్ ఫస్ట్ మూవీ రచ్చ

- నాలుగు భాషల్లో స్టార్ కొరియోగ్రాఫర్

- పెద్దిలో చికిరి చికిరి సాంగ్

తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చి కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌ గురించి అందరికీ తెలిసిందే. 2009లో తన కెరీర్‌ను ప్రారంభించిన జానీ.. అందరు స్టార్‌ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. అయితే టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ని ఎక్కువ ఎంకరేజ్‌ చేసిన హీరో రామ్‌చరణ్‌.

జానీ మాస్టర్‌ మొదట వర్క్‌ చేసిన స్టార్‌ హీరో చరణ్‌. అంతకుముందు కొన్ని సినిమాలకు పని చేసినా రచ్చ సినిమా కోసం జానీని పిలిపించి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా తను చేసిన చాలా సినిమాలకు జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నారు చరణ్‌. ఆ క్రమంలోనే స్టార్‌ హీరోలంతా జానీతో కొరియోగ్రఫీ చేయించుకున్నారు. అలా ఇండియాలో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కొరియోగ్రాఫర్స్‌గా పేరు తెచ్చుకున్నారు జానీ.

ఇదిలా ఉంటే.. 2024లో జానీపై లైంగిక ఆరోపణలు రావడంతో నెలరోజులపాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత అందరూ తనని నేరస్తుడిగా చూస్తుండడం, వచ్చిన నేషనల్‌ అవార్డు చేజారిపోవడం వంటి కారణాల వల్ల జానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే వెంటనే తనని తాను తెలుసుకొని ఎప్పటిలాగే డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటూ సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తను హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం కోసం జానీని పిలిపించి ఒక పాట చేసే అవకాశం ఇచ్చారు రామ్‌చరణ్‌. ‘చికిరి చికిరి..’ అంటూ సాగే ఈ పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలో జానీ కంపోజ్‌ చేసిన స్టెప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మెగా అభిమానులు ఈ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

జానీ మాస్టర్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిలిచి మరీ అవకాశం ఇచ్చిన చరణ్‌ని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న జానీకి అండగా నిలిచినందుకు చరణ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన కెరీర్‌ ఆరంభం నుంచి టాలెంట్‌ ఉన్న టెక్నీషియన్స్‌ని చరణ్‌ ఎంకరేజ్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా చికిరి చికిరి సాంగ్‌ను జానీ మాస్టర్‌తో చేయించడం గురించి నెటిజన్లు స్పందిస్తూ.. కష్టాల్లో ఉన్నవారి వెన్నంటి నిలబడి ప్రోత్సహించడం నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ చరణ్‌ను అభినందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.