English | Telugu
జానకీరామ్ అంత్యక్రియలు పూర్తి
Updated : Dec 7, 2014
నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మొయినాబాద్ మండలం ముర్తుజాగూడలోని ఫాంహౌస్ లో జానకీ రామ్ పార్థీవదేహానికి అతని కుమారుడు చిన్నారి తారకరామారావు నిప్పటించారు. తారకరామారావు వెంటే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. నల్గొండ జిల్లా మునుగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతకుముందు హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమైంది. జానకి రామ్ తండ్రి హరికృష్ణ, సోదరులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.