English | Telugu

సెన్సార్ బోర్డు ఎదుట ధర్నా.. జానకి అంటే సీతాదేవి అని తెలియదా

సెన్సార్ బోర్డు ఎదుట ధర్నా.. జానకి అంటే సీతాదేవి అని తెలియదా

ప్రేమమ్, శతమానంభవతి, రాక్షసుడు, కార్తికేయ 2 , టిల్లు స్క్వేర్, డ్రాగన్  వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన అనుపమ ప్రస్తుతం మలయాళంలోనే 'జానకి వర్సస్ స్టేట్ అఫ్ కేరళ(Janaki vs State of kerala)'అనే చిత్రంలో నటించింది. విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ మూవీ కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా, జానకి అనే బాధిత యువతిగా అనుపమ టైటిల్ రోల్ ని పోషించింది. ఒకప్పటి మలయాళ సూపర్ స్టార్, ప్రస్తుత కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi)లాయర్ గా నటించాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.   

ఇక చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డుకి అప్లై చేసింది. కానీ సెన్సార్ బోర్డు చిత్ర ప్రతినిధులతో  మూవీలోని బాధిత యువతీ పేరు జానకి. ఆ పేరు హిందువులు దైవంగా కొలిచే సీతాదేవికి మరోపేరు. పైగా  కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. కాబట్టి జానకి పేరుని మార్చాలని సూచిస్తు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తు  మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన 'అమ్మ' యూనియన్ తో పాటు, ఫిలిం ఎంప్లాయ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డు ఎదుట ధర్నాకి దిగారు. ఇందులో పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు పాల్గొని బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. వాళ్ళు  చెప్పినట్లు చేస్తే మూవీలోని చాలా డైలాగులు మార్చాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.     

ఈ విషయంలో చిత్ర బృందం కోర్టుని కూడా ఆశ్రయించింది. దీంతో  రిలీజ్ పై అందరిలోను ఉత్కంఠత నెలకొని ఉంది. 'ప్రవీణ్ నారాయణ్'(Pravin Narayan)దర్శకత్వంలో తెరకెక్కిన 'జానకి వర్సస్ స్టేట్ అఫ్ కేరళ' లో అనుపమ, సురేష్ గోపి తో పాటు శృతి రామ చంద్రన్, దివ్య పిళ్ళై(Divya Pillai),అక్సర్ అలీ, మాధవ్ సురేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫణింద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ మూవీ  మలయాళం తో పాటు, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేసారు.


 

సెన్సార్ బోర్డు ఎదుట ధర్నా.. జానకి అంటే సీతాదేవి అని తెలియదా