English | Telugu
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి దొరికిపోయిన బాబు
Updated : Dec 28, 2015
బాలకృష్ణ - ఎన్టీఆర్ ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఒకరిపై ఒకరు పరోక్షంగానే.. సై అంటే సై అంటూ... సవాళ్లు విసురుకొంటున్నారు. వీరిద్దరి సినిమాలు ఇప్పుడు సంక్రాంతి బరిలోఉన్నాయి. అందుకే.. ఎవరి గురించి ఏం మాట్లాడాలనుకొన్నా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త తెలియక జగపతిబాబు అడ్డంగా బుక్కయిపోయాడు. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్‌లో.
ఈ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే! ఆడియో ఫంక్షన్‌లో జగపతిబాబు మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'డైలాగ్.. డైలాగ్' అంటూ అరచి గోల చేశారు. దానికి జగపతిబాబు `ఇది లెజెండ్ సినిమాకాదు.. డైలాగులు చెప్పడానికి` అనేశాడు. ఎన్టీఆర్ ఫంక్షన్‌లో బాలయ్య సినిమా మాట వినిపించడం అదొక్కటే! దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గగ్గోలు చేశారు. అంటే జగపతి అభిప్రాయం ఏమిటి?? ఎన్టీఆర్ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నాడా? బాలయ్యే గ్రేట్ అని చెప్పాలన్నది ఆయన ప్రయత్నమా? లేదంటే ఇది అలాంటిసినిమా కాదన్నది ఉద్దేశమా? అంటూ బాబు గారి డైలాగ్‌కి.. విభిన్న కోణాల్లో అర్థాలు వెదుక్కోసాగారు. అంతటితో ఆగలేదు.. డబ్బింగ్ చెప్పేగానీ.. ఈసినిమా ఏమిటో నాకు అర్థం కాలేదు.. అంటూ మరోసారి నోరు జారాడు. నాకోసమైతే ఈ సినిమా చూడొద్దు.. ఎన్టీఆర్ కోసం చూడండి... అంటూ ఏవేవో మాట్టాడాడు. దాంతో ఆడియో ఫంక్షన్‌లో కాస్త గందరగోళం నెలకొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ జగపతిబాబునీ టెన్షన్‌లో పెట్టేసింది. అందుకే గబగబ తన స్పీచ్ ముగించేశాడు.