English | Telugu

శ్రీ‌మంతుడు డాడీకి కోపం వ‌చ్చింది

లెజెండ్‌తో త‌న కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ ఇచ్చుకొన్నాడు జ‌గ‌ప‌తిబాబు. ఆ త‌ర‌వాత కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించినా, అవంత పేరు తీసుకురాలేదు. ఈసారి శ్రీ‌మంతుడుపై బాగా న‌మ్మ‌కం పెట్టుకొన్నాడు. మ‌హేష్ బాబు కి డాడీ అంటే మాట‌లా..?? ఈసినిమా హిట్ట‌యితే త‌న కెరీర్ కి మ‌రింత ఊపొస్తుంద‌ని భావించాడు.

అయితే ఈ సినిమా ఫైన‌ల్ అవుట్ పుట్ చూసి జ‌గ‌ప‌తిబాబు బాగా డిస్స‌ప్పాయింట్ అయ్యాడ‌ని టాక్‌. మొత్త‌మ్మీద 10 నిమిషాల పాటు కూడా క‌నిపించ‌డ‌ట‌. త‌న‌పై చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాలు కూడా చివ‌రి నిమిషాల్లో ఎడిట్ చేయ‌డం వ‌ల్ల‌.. జ‌గ‌ప‌తిబాబు పూర్తిగా నిరుత్సాహానికి లోన‌య్యాడ‌ని టాక్‌. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో కూడాజ‌గ‌ప‌తిబాబు గొడ‌వ ప‌డ్డాడ‌ట‌.

అలాంట‌ప్పుడు ఆ సీన్లు ఎందుకు రాశావ్‌, నాతో ఎందుకు తీశావ్‌..?? అని బాబు త‌న‌దైన శైలిలో అడిగాడ‌ట‌. సినిమా హిట్ట‌యితే మ‌ళ్లీ ఆ సీన్లు క‌లుపుతా అని ద‌ర్శ‌కుడు మాటిచ్చాడ‌ట‌. అయినా స‌రే, బాబు కోపంతో ఊగిపోతున్నాడ‌ని టాక్‌. ఇక మీద‌ట సినిమా ప్ర‌మోష‌న్లకు తాను దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.