English | Telugu
నిన్న శంకర్..నేడు చలాకీ చంటి
Updated : Apr 25, 2016
జబర్దస్త్ యాక్టర్స్ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇంటివాళ్లవుతున్నారు. కొద్ది రోజుల క్రితం షకలక శంకర్ తన మేనమామ కూతురిని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వివాహం చేసుకోగా..తాజాగా చలాకీ చంటి ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని హాస్యనటుడు జబర్దస్త్ సహచరనటుడు వేణు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. “ఈ రోజు మా చంటి గాడి పెళ్లి అయ్యిందోచ్.. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి.. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా..” అంటూ చంటి దంపతుల ఫొటోను పోస్టు చేశాడు.