English | Telugu
ఈ ముగ్గురు జోడీ కడితే బొమ్మ బ్లాక్ బస్టరే!
Updated : Jan 22, 2023
తెలుగు సినిమాలలో మేకర్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా పలు రకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటివి చాలాసార్లు వర్కౌట్ అవుతూ కూడా ఉంటాయి. ఇక విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ మెగా కాంపౌండ్ హీరోలతో చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు సాధించాయి. పైగా ఆయా చిత్రాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అయితే ఆ రేంజ్ మరో లెవల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మైత్రి మూవీ మేకర్ సంస్థ మెగా హీరోలతో చేసే చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందిస్తే చాలు అవి బ్లాక్ బస్టర్స్ అయిపోతాయని సెంటిమెంట్ కొత్తగా ఒకటి వచ్చింది.
మైత్రివారు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో రెండు హిట్లందుకొని మూడవ సినిమాగా రంగస్థలం చేశారు. రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు. ఇక ఆ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి తీశారు. వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఉప్పెన సినిమా చేశారు. ఇక ఎంత కాదనుకున్న అల్లు అర్జున్ కూడా మెగా క్యాంపు వ్యక్తి కిందనే లెక్క. ఆ లెక్కన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన పుష్ప చిత్రం కూడా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. సినిమా కూడా దేశ విదేశాలలో ఘనవిజయం సాధించింది. ఏకంగా ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. తాజాగా మైత్రి మూవీస్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇలా చూసుకుంటే మెగా హీరోలు- మైత్రి సంస్థ- దేవిశ్రీ సంగీతం కలిస్తే ఇక వాటికి తిరిగే ఉండదని అందరూ అంటున్నారు.
