English | Telugu

అంజ‌లి ఎవ‌రిని కొట్టింది?

ఏదో ఓ రకంగా మీడియాలో తర‌చూ వార్త‌ల్లో ఉండ‌డం అంజ‌లికి అల‌వాటే. అంజ‌లిపై వ‌చ్చిన రూమ‌ర్లు అన్నీ ఇన్నీ కావు. తెలుగు మీడియా అంజ‌లి పాప‌ని అంత‌గా ప‌ట్టించుకోక‌పోయినా, త‌మిళంలో మాత్రం అంజ‌లి ఎప్పూడూ హాట్ టాపిక్కే. ఈమ‌ధ్య కూడా అంజ‌లిపై తమిళంలో బోలెడ‌న్ని రూమ‌ర్లు వ‌చ్చాయి. ఓ ద‌ర్శ‌కుడిబ‌ర్త్ డే పార్టీకి హాజ‌రైన అంజ‌లి అక్క‌డ ఓ వ్య‌క్తికి చెంప‌దెబ్బ రుచి చూపించింద‌ట‌. ఆ వ్య‌క్తి ఎవ‌రు? అంజ‌లి ఎందుకు చేయి చేసుకోవాల్సివ‌చ్చింద‌నేది త‌మిళంలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రెస్ మీట్ల‌లోనూ అంజ‌లి ప్ర‌వ‌ర్త‌న బాగా లేద‌ని, మీడియా ఉండ‌గానే ఫోన్ల‌లో మాట్లాడుకొంటూ ఇరిటేట్ చేస్తుంద‌ని త‌మిళ మీడియా ఆగ్ర‌హంగా ఉంది. దీనిపై అంజ‌లి కూడా క్లారిటీ ఇస్తోంది. తాను ఎవ‌రీనీ కొట్ట‌లేదని త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని మీడియాపై సీరియ‌స్ అయ్యింది అంజ‌లి.

ఫోన్లో మాట్లాడుకోవ‌డం త‌ప్పెలా అవుతుంద‌ని, అర్జెంట్ కాల్స్ ని రిసీవ్ చేసుకోవ‌ద్దంటే ఎలా అని మండిప‌డుతోంది. అయినా త‌మిళ మీడియా అంజ‌లిని ఇప్ప‌ట్లో వ‌దిలేట్టు లేదు. ఈమ‌ధ్య త‌ర‌చూ అంజ‌లి అమెరికా వెళ్తోంద‌ని అక్క‌డ అంజ‌లికి ఓ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడ‌న్న వార్త‌లు ఇప్ప‌టికీ త‌మిళ మీడియాలో హాట్ టాపిక్కులుగా చ‌లామ‌ణీ అవుతున్నాయి. పాపం.. అంజ‌లి వాళ్ల‌కు అలా బుక్క‌యిపోయింది మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.