English | Telugu

తరుణ్ కొత్త లవ్ స్టొరీతో రాబోతున్నాడు

హీరో తరుణ్ నూతన చిత్రం ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, హీరో శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

హీరో తరుణ్ మాట్లాడుతూ.. కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాం. అక్కడ అందరు కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా చూసాను. నాకు చాలా నచ్చింది. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ ఇది. ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉండవు. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బావుంటాయి. మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. శ్రీనాథ్ విజయ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారు. ఆయన హరీష్ జయరాజ్, రెహ్మాన్ ల దగ్గర పని చేసారు. ఈ సినిమాకు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేయనున్నాం. సినిమా అంతా హీరో, హీరోయిన్ ల మీదే నడుస్తుంటుంది. అక్టోబర్ 7 లేదా 10 నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నాం. మొదటి షెడ్యూల్ పది రోజులు ఉడిపి ప్రాంతంలో దాని కంటిన్యూస్ గా కూర్గ్ లో, ఆ తరువాత మరో పదిహేను రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరపనున్నాం. సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. రెండు పాటల చిత్రీకరణ ఫారెన్ లో చేయనున్నాం. డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.



నిర్మాత ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ కు హీరోగా తరుణ్ మాత్రమే సూట్ అవుతాడని ఆయనని సెలెక్ట్ చేసుకున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం.. అని చెప్పారు.

దర్శకులు రమేష్, గోపి మాట్లాడుతూ.. కన్నడలో ఈ సినిమా చూసిన తరువాత తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఈ సబ్జెక్టు పై రెండు సంవత్సరాలు వర్క్ చేసాం. తెలుగు నేటివిటీకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసాం. ఈ సినిమాలో తరుణ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. తరుణ్ మాత్రమే ఈ కథకు న్యాయం చేయగలడనిపించింది. ఒక అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు ప్రేమించామనేది కాదు, ఎంత బాగా ప్రేమించామనే లైన్ మీద సినిమా రన్ అవుతుంది.. అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: క్రిస్టోఫర్ జోసఫ్, మ్యూజిక్: శ్రీనాథ్ విజయ్, ఎడిటర్: సింగంపల్లి శివ శంకర్, డైలాగ్స్: వీరబాబు బాసిన, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ పి, జగదీశ్, నిర్మాత: ఎస్.వి.ప్రకాష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ గోపి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .