English | Telugu

హరిహర వీరమల్లుకు లైన్ క్లియర్ చేసిన రేవంత్ సర్కార్!

హరిహర వీరమల్లు మూవీ టికెట్ రెట్ల పెంపునకు తెలంగాణలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 23న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600 గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచుతు జీవో జారీ చేసింది. హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఫిక్షనల్ కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.

నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఏపీ లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసింది. మూవీ రిలీజైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధరలు పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత గవర్నమెంట్ ని కోరారు. కానీ మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.