English | Telugu
చక్కనమ్మా చిక్కింది
Updated : Jan 9, 2015
లేటెస్ట్ గా హాన్సికను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారట. హాన్సికను చూసినవారంతా.. చక్కనమ్మా చిక్కినా అందమే అంటున్నారు. ఒకప్పుడు బొద్దుగా ముద్దపప్పులా కనిపించే హన్సిక ఇప్పుడు ఇలా నాజూగ్గా తయారై అందరిని తనవైపే తిప్పుకుంటోంది. అప్‌డేట్ అవకపోతే ఔట్ అయిపోవడం ఖాయమని గ్రహించిన హన్సిక ఇప్పుడు పూర్తీగా నాజుగ్గా తయారైంది. ఈ భామ తన కొత్త లుక్కు ఫొటోలను తాజాగా తన ట్విట్లర్ పేజీలో, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటోంది. మొత్తానికి కొత్త హీరోయిన్లు దూసుకొస్తున్న తరుణంలో హన్సిక ఇప్పుడు భారీ కసరత్తులకే దిగినట్టు కనిపిస్తోంది. కెరీర్ ను మరి కొంత కాలం నడిపించాలన్న పట్టుదలతో ఉందీ భామ.