English | Telugu

రామ్‌చ‌ర‌ణ్‌ని దెబ్బ‌కొట్టిన గోపీచంద్‌

స్టార్ హీరో సినిమా వ‌స్తోందంటే మిగిలిన సినిమాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. ఆ వ‌సూళ్ల ప్ర‌భావం మాపై ఎక్క‌డ ప‌డిపోతుందో అన్న భ‌యాలూ వెంటాడ‌తాయి. కానీ సినిమాలో స‌త్తా ఉంటే.. ఏ స్టార్ హీరో, ఏం చేయ‌లేడ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. ఇందుకు గోపీచంద్ క‌థానాయ‌కుడు న‌టించిన లౌక్యం చిత్రం అద్దం ప‌ట్టింది. స‌రిగ్గా ద‌స‌రా పండ‌క్కి వారం రోజుల ముందు విడుద‌లైంది.. లౌక్యం. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్పాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌గ‌లిగింది. తీరా చూస్తే.. ద‌స‌రా పండ‌క్కి గోవిందుడు అంద‌రివాడేలే వ‌చ్చేశాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమా అంటే.. అంద‌రి క‌ళ్లూ అటువైపే. దాంతో లౌక్యం నిర్మాత‌లు భ‌య‌ప‌డ్డారు. గోవిందుడు త‌మ సినిమాని దెబ్బ కొడ‌తాడ‌ని ఊహించారు. అనుకొన్న‌ట్టే గోవిందుడుకు తొలి మూడు రోజులూ భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. దాంతో లౌక్యం డ‌ల్ అయ్యింది. తొలి మూడు రోజుల ఊపు త‌గ్గాక‌.. అనూహ్యంగా లౌక్యం వ‌సూళ్లు ఊపందుకొన్నాయి. కొన్ని చోట్ల గోవిందుడు వ‌సూళ్ల‌ను దాటి లౌక్యం క‌లెక్ష‌న్లు రాబ‌ట్టుకొంది. అంతేకాదు.. లౌక్యం సినిమా ఇటీవ‌ల 50 రోజులు పూర్తి చేసుకొంది. దాదాపు 50 కేంద్రాల్లో అర్థ సెంచ‌రీ కొట్టింది. మొత్తానికి ఈ సినిమా రూ.20 కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకొంది. మ‌రోవైపు గోవిందుడు అంద‌రివాడేలే కేవ‌లం 6 కేంద్రాల్లో 50 ఆడింది. చాలా చోట్ల బ‌య్య‌ర్లకు డ‌బ్బులు రాలేద‌ట‌. మ‌రికొన్ని చోట్ల‌ స్ప‌ల్ప న‌ష్టాల‌తో గోవిందుడు గ‌ట్టెక్కాడు. అలా... లౌక్యం - గోవిందుడు మ‌ధ్య జ‌రిగిన పోటీలో... గోపీచంద్‌నే విజ‌యం వ‌రించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.