English | Telugu

గోపాలుడు తొందరపడుతున్నాడు!!

గోపాల గోపాల చిత్రాన్ని సురేష్ బాబు జ‌న‌వ‌రి 14న తీసుకొద్దామ‌నుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఎందుకంటే పండుగకు 'ఐ' తప్పిస్తే మారే సినిమా విడుదలవ్వడం లేదు. అందుకే జ‌న‌వ‌రి 9 చిత్రబృందాన్ని ఊరిస్తోంది. పండుగకు కనీసం ఐదు రోజులు ముందు రిలీజ్ చేస్తేసంక్రాంతి వ‌ర‌కూ నిల‌బెడితే క‌లెక్షన్లకు ఢోకా ఉండ‌ద‌ని టీమ్ భావిస్తోంది. అందుకే పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు మ‌రింత వేగ‌వంతం చేస్తోంది టీమ్‌.అలాగే 'ఐ' సినిమా భారీ హిట్ కొట్టిన తమ సినిమాకు ఎలాంటి డోకా వుండదని అనుకుంటున్నారట. అందుకే సినిమాను జ‌న‌వ‌రి 9న ఎన్ని ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయడం అన్న దానిపై సురేష్ బాబు దృష్టి పెట్టారని తెలుస్తోంది. మరి జనవరి 9న సినిమాని విడుద‌ల చేయ‌డం సాధ్యమా?