English | Telugu
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయాయి.. ఆదుకోవాలని విన్నపం
Updated : Sep 4, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)వివి వినాయక్(vv vinayak)కాంబోలో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆది. ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందిన నటుడు ఫిష్ వెంకట్(fish venkat)చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ,డీ, దుబాయ్ శీను,కృష్ణ, గబ్బర్ సింగ్, రచ్చ హైపర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అత్తారింటికి దారేది,నాయక్, ఖైదీ నెంబర్ 150, డి జె టిల్లు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నోసినిమాల్లో డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అశేష సినీప్రేక్షకుల్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. చెప్పే డైలాగ్ చిన్నదే అయినా సరే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడం ఫిష్ వెంకట్ యాక్టింగ్ స్టైల్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంలో పడింది.
ఫిష్ వెంకట్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆగ్రా వెళ్ళాడు. అక్కడ కాలికి మేకు లాంటిది గుచ్చుకోవడంతో చిన్న గాయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకి బీపీ,షుగర్ అటాక్ చెయ్యడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ సోకి బాగా లావు అయ్యింది .దాంతో ఆపరేషన్ చేసారు. కానీ సంవత్సరంన్నర క్రితం డయాలసిస్ వచ్చి రెండు కిడ్నీలు చెడిపోయాయి. దానికి తోడు కాలు ఇన్ఫెక్షన్ కూడా అలాగే ఉండంతో ప్రస్తుతం సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.ఇప్పటి వరకు ఇరవై లక్షలు దాకా ఖర్చుపెట్టాడు. డాక్టర్స్ అయితే డయాలసిస్ కి సంబంధించి ఆపరేషన్ చెయ్యాలని అంటున్నారు. అందుకు గాను సుమారు యాభై లక్షలు దాకా అవుతాయి. అంత ఆర్ధిక స్థోమత లేక లేకపోవడంతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చూపించుకుంటున్నాడు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరకి తెలియదు. ఫస్ట్ నుంచి కూడా ఎవర్ని చేయి చాచి అడగడానికి ఇష్టపడకపోవడంతో తన ఆరోగ్య పరిస్థితి ఎవరకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇక 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిష్ వెంకట్ కి కార్డు లేదు. దివంగత హీరోలు శ్రీహరి(srihari)నందమూరి తారక రత్న(taraka ratna)లు వెంకట్ కి కార్డు కోసంట్రై చేసారు. కానీ ఆ టైంలో వేరే వాళ్ళకి మెంబెర్ షిప్ ఇచ్చారు. ఈ విషయాన్నీ ఫిష్ వెంకట్ నే చెప్పుకొచ్చాడు. అలాగే నేను చాలా మందికి సహాయం చేసానని, ఇప్పుడు వాళ్ళందరు నా ఇంటి వైపు కూడా రావడం లేదని తన ఆవేదనని వెళ్లబుచ్చాడు. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతం ఫిష్ వెంకట్ స్వస్థలం. సినీ పెద్దలు వెంకట్ ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.