English | Telugu

బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పుల వర్షం..

బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై ఏకంగా 24 రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ గురుగ్రామ్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5:30-6 ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బైక్‌లపై వచ్చి.. ఎల్విష్ ఇంటిపై కాల్పులు వర్షం కురిపించారు. అయితే ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు.

ఈ కాల్పులకు హిమాన్షు భావు గ్యాంగ్ బాధ్యత వహిస్తూ.. ఎల్విష్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని, అతనికి వార్నింగ్ ఇవ్వడం కోసమే ఈ కాల్పులు జరిపినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు.

వివాదాస్పద యూట్యూబర్ గా ఎల్విష్ యాదవ్ కి పేరుంది. గతంలో రెస్టారెంట్ లో ఒక వ్యక్తిపై చేయి చేసుకోగా.. పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల రేవ్ పార్టీ కూడా నిర్వహించి పట్టుబడ్డాడు. ఇలా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఎల్విష్.. ఇప్పుడు కాల్పుల ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.