English | Telugu

సూపర్ స్టార్ కి అప్పులేంటి?

ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న న‌టుడు ఎవ‌రంటే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరే చెబుతారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు లెక్క‌లేనంతమంది అభిమానులున్నారు. ర‌జ‌నీ సినిమా అంటే బాక్సాఫీసుకి పండ‌గే. లింగ కోసం దాదాపుగా రూ.50 కోట్ల పారితోషికం అందుకొన్నాడ‌ని టాక్ వినిపించింది. ఇలాంటి ర‌జ‌నీకాంత్ అప్పుల్లో ఉన్నాడంటే న‌మ్ముతారా..?? కానీ ఇది నిజం. త‌మిళ‌నాడుకు చెందిన ఎక్షిమ్ బ్యాంక్‌లో ర‌జ‌నీకాంత్ త‌న ఆస్తుల్ని త‌న‌ఖా పెట్టి రూ.22 కోట్లు అప్పుగా తీసుకొన్నాడ‌ట‌. బ్యాంక్ ఎన్నిసార్లు నోటీసులు పంపినా.. ర‌జ‌నీ స్పందించ‌లేద‌ని తెలిసింది. వాయిదాలు కూడా చెల్లించ‌క‌పోవ‌డంతో ర‌జ‌నీ ఆస్తుల్ని వేలం వేస్తున్న‌ట్టు ఆ బ్యాంక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ వార్త విన‌గానే ర‌జ‌నీ అభిమానులంతా షాక్ కి గుర‌య్యారు. ఎలాగైనా ర‌జ‌నీ ఆస్తుల వేలం ఆపాల‌ని కొంత‌మంది నిర్ణ‌యించుకొన్నార్ట‌. చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.