English | Telugu

ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటున్న సినీ కార్మికులు.. ఆందోళనలో చిత్ర పరిశ్రమ!

తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా షూటింగ్స్‌ కూడా ఆగిపోయాయి. వేతనాల పెంపుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయంలో కార్మికులు పట్టు వీడడం లేదు, అలాగే నిర్మాతలు దిగి రావడం లేదు. ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల వ్యవహార శైలిపై ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ వల్లభనేని స్పందించారు.

‘గత ఎనిమిది రోజులుతగా సమ్మె చేస్తున్నాం. ఎవరైతే 30 శాతం వేతనాలు పెంచి ఇస్తున్నారో వారి సినిమాలకే పనిచేస్తున్నాం. ఫిలిం ఛాంబర్‌తో నిన్న జరిగిన చర్చలతో సమస్య పరిష్కారం అయిపోతుందని నమ్మాం. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మొదట 20 శాతం పెంచండి, ఆ తర్వాత రెండేళ్ళకు 10 పర్సెంట్‌ పెంచండి అని అడిగాము. వాళ్ళు మాత్రం ఏడాదికో పర్సెంటేజ్‌ చెప్పారు. అది కూడా కొన్ని యూనియన్లకు అసలు పెంచం అని చెప్పారు. ఫైటర్స్‌, డాన్సర్స్‌లకు కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు నిర్లిప్తంగా ఉన్నారు. పొట్ట కాలితే వాళ్ళే దారికొస్తారు అనే ధోరణిలో వాళ్లున్నారు. కార్మికులందరి వేతనాలు పెంచాలి. ఇదే మా డిమాండ్‌. ఛాంబర్‌తో చర్చలు జరిపి రెండు రోజుల్లో లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు రమ్మన్నారు. ఛాంబర్‌తో చర్చలు సఫలం కాకపోతే సమ్మె కొనసాగుతుంది.

అలాగే విశ్వప్రసాద్‌ ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా వెళతాం. ఆయన్నుంచి మాకు 90 లక్షల బకాయిలు రావాల్సి ఉన్నాయి. విశ్వప్రసాద్‌ మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఛాంబర్‌కి చెప్పాలి. అంతేగానీ, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. గత ఎనిమిది రోజులుగా చిరంజీవిగారు ఎప్పటికప్పుడు మా వివరాలు తెలుసుకుంటున్నారు. మా కార్మికుల పక్షాన నిలబడిన కోమటిరెడ్డిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వారిని కలుస్తాం. దీనిలో ప్రభుత్వం జోక్యం కూడా ఉంటే కొన్ని వారు కొన్ని సూచనలు చేస్తారు. ఏదైనా ఛాంబర్‌ నిర్ణయం ఫైనల్‌.ఫ్రభుత్వం జొక్యం అంటే వారి సూచనలు చేస్తారు, ఎదైనా ఛాంబర్‌ డెషిషనే ఫైనల్‌. మా వేతనాల పెంపు విషయంలో మేం చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నాం. మొత్తం 24,000 మంది కార్మికులు ఉన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫిలిం ఛాంబర్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నాం. పిలుపొస్తే వెళ్లి మాట్లాడతాం’ అన్నారు అనిల్‌ వల్లభనేని.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.