English | Telugu

ఓటీటీలోకి రవితేజ 'ఈగల్' మూవీ!

మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'ఈగల్' మూవీ ఓటీటీ రైట్స్ ని ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. అయితే స్ట్రీమింగ్ డేట్ ని మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల కాలంలో జయాపజయాలతో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. 'ఈగల్' కూడా అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతం అందించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.