English | Telugu

నందమూరి హీరోలు ఏది చెప్తే అది చేసేయ్యటమేనా! 

తెలుగు చలన చిత్ర సీమపై 'నందమూరి'(Nandamuri)హీరోల సంతకం చాలా ప్రత్యేకం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి 'తారకరామారావు'(Ntr)గారి వారసత్వంగా మొదలై, బాలకృష్ణ(Balakrishna)హరికృష్ణ(Harikrishna),ఎన్టీఆర్(Ntr),కళ్యాణ్ రామ్(Kalyan Ram)లు తమ అద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. తెలుగు సినిమాకి సంబంధించి, ఈ ఫ్యామిలీ పోషించని పాత్ర లేదు. సృష్టించని రికార్డు లేదు. క్రమశిక్షణకి కూడా మారుపేరైన ఈ హీరోలు సినిమా విషయంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛని ఇస్తారు. ఎలాంటి సన్నివేశంలో అయినా, రిస్కీ షాట్ లో అయినా, దర్శకుడు చెప్పినట్టు చేస్తారు. ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో చాలా మంది మేకర్స్ చెప్పారు. తారకరత్న(Tarakarathna)కూడా దర్శకుల హీరోగా తన సత్తా చాటిన విషయం తెలిసిందే.


రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు 'వి. సముద్ర'(V.Samudra)'తెలుగు వన్'(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు సినిమాలకీ సంబంధించి నందమూరి హీరోల అందరిలో, ఇది నేను చెయ్యను, నాకు రాదు అనే మాట వినపడదు. రిస్కీ షాట్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు. 'హరికృష గారి వల్ల ఒకసారి గుండె ఆగినంత పని అయ్యింది. 'టైగర్ హరిచంద్ర కి సంబంధించి ఒక రైతు లారీకి తగిలి చనిపోయాడని హరికృష గారు స్పీడ్ గా వచ్చే షాట్ ని షూట్ చేస్తున్నాం. కానీ హరికృష్ణ గారు పరుగెత్తుకుంటూ వస్తు అనుకోకుండా కాలు జారీ పడ్డారు. దాంతి లారీ ఆయనకి రాసుకుంటూ వెళ్ళింది. దీంతో అందరం ఒక్కసారిగా షాక్ అయ్యాం. ఆ తర్వాత హరికృష్ణ గారిని అడిగితే ఏం కాలేదు. సినిమా ముఖ్యమని అన్నారని సముద్ర చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులతో పాటు సినీ ప్రేమికులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

సముద్ర కి సినీ రంగంతో మూడున్నర దశాబ్డలపై నుంచే అనుబంధం ఉంది. సహాయ దర్శకుడిగా చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో నరసింహనాయుడు, వంశానికొక్కడు లాంటి ఎన్నో చిత్రాలకి పని చేసాడు. హరికృష గారితో శివరామరాజు, టైగర్ హరిచంద్రప్రసాద్ లాంటి చిత్రాలని తెరకెక్కించేటప్పుడు ఎన్టీఆర్ షూటింగ్ కి వచ్చే వాడు. ఆ సమయంలో సముద్ర తన కథల్ని ఎన్టీఆర్ కి చెప్పేవాడు. కళ్యాణ్ రామ్ తో 'విజయదశమి', తారకరత్న తో వెంకటాద్రి ని తెరకెక్కించాడు. ఇప్పటి వరకు సుమారు పదిహేను చిత్రాల వరకు పని చేసిన సముద్ర కెరిర్ లో విజయాల శాతం ఎక్కువ.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.