English | Telugu

చిరు, ప‌వ‌న్‌ల‌తో దిల్‌రాజు సినిమా??

చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి పెట్టారు. వ‌చ్చే రెండు మూడేళ్లు రాజ‌కీయప‌రంగా స్థ‌బ్దుగా ఉంద‌ని, అందుకే సినిమాల‌పై దృష్టి పెట్టి అభిమానుల్ని అల‌రించాల‌ని కోరుకొంటున్న‌ట్టు చిరు తెలిపారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న కోసం క‌థ‌లు రెడీ అవుతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. త‌న త‌దుప‌రి చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత అని చిరు ప్ర‌క‌టించ‌డంతో ఆ బెర్తుపై ఎవ్వ‌రికీ ఆశ‌ల్లేవు. కానీ.. ఆ త‌ర‌వాతి సినిమాల కోసం చిరుని ఒప్పించాల‌ని నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

జాబితాలో ముందుగా వినిపించే పేరు దిల్‌రాజు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆడియో వేడుక‌లో దిల్ రాజులాంటి నిబ‌ద్ధ‌త క‌ల నిర్మాత‌తో సినిమా చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు చిరు. దాంతో దిల్‌రాజు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమా చేయ‌డానికి తాను స‌న్నాహాలు చేస్తున్నాన‌ని, అన్నీ కుదిరితే ఆ సినిమాలో చిరంజీవి కూడా క‌నిపిస్తార‌ని చెప్పి.. మెగా ఫ్యాన్స్‌ని సంతోష‌పెట్టాడు దిల్‌రాజు.

స‌ర్దార్ త‌ర‌వాత దాస‌రి నిర్మాణంలో ప‌వ‌న్ న‌టించ‌బోతున్నాడు. ఆ త‌ర‌వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమాలో చిరంజీవి కూడా న‌టిస్తే బాగుంటుంద‌ని, అలాంటి క‌థ కోసం తాను అన్వేషిస్తున్నాన‌ని దిల్ రాజు చెబుతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి ఇన్నేళ్ల‌యినా చిరంజీవితో క‌ల‌సి న‌టించ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు ఇలా రాబోతోంద‌న్న‌మాట‌. చిరు, ప‌వ‌న్‌ల‌కు స‌రిప‌డ క‌థ‌ని వెదికిప‌ట్టుకోవ‌డం దిల్‌రాజులాంటి మాస్ట‌ర్ బ్ర‌యిన్‌కి పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. చూద్దాం... దిల్‌రాజు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.