English | Telugu

హీరోగా ప్రముఖ నటుడి కుమారుడు.. దర్శకుడిగా శంకర్.. పూరి కొడుకు క్లాప్!

ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మాణంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

సుమన్, రవి శివతేజ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ వర్కాల ఎడిటర్ కాగా, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.

మూవీ లాంచ్ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. "ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ గారికి ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వుండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యుల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది'' అన్నారు

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. "సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ వుండాలి. అలాంటి ప్యాషన్ తో నిర్మాత హరి గౌడ్, హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా వుంది. దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ళ అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా వుంది. ఇది తనకి మూడో చిత్రం. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి" అని కోరారు

హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. "ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వున్న కథ. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ వుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి'' అని కోరారు.

దేవరాజ్ మాట్లాడుతూ.. "దర్శకుడు శంకర్ చాలా అద్భుతమైన కథని రాసుకున్నారు. కథ చాలా బావుంది. హరి గౌడ్ మంచి అభిరుచి వున్న నిర్మాత. చాలా మంచి టీం కలసి చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. మీ అందరి ఆశీస్సులు వుండాలి'' అని కోరారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. "ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించిన తనికెళ్ళ భరణి గారు, నరసింహారెడ్డి గారు, ఆకాష్ పూరిగారు, దేవరాజ్ గారికి కృతజ్ఞతలు, అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.