English | Telugu

సల్మాన్‌తో దీపిక నటించకుండా అడ్డుకుంటోంది ఎవరు?

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కింగ్‌ఖాన్ షారూఖ్ ఖాన్‌ లాంటి అగ్ర హీరోలతో పాటు క్రేజీ స్టార్లందరితో నటించిన ముద్దుగుమ్మ దీపికా పదుకోనేకు ఒక కల ఉంది. అది ఒక్కసారైనా సల్మాన్ ఖాన్‌తో నటించాలని. కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలతో దీపిక కూడా ఎగిరిగంతేసింది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఆమె ఆశలు ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు.

అసలు మ్యాటరేంటంటే..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ సల్మాన్‌తో గతంలో "ఏక్ థా టైగర్", "బజరంగీ భాయిజాన్" వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను తీశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబీనేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే టైటిల్ పేరును "ట్యూబ్ లైట్"గా ప్రకటించారు. ఇందులో సల్మాన్‌కు జోడీగా దీపికా పదుకోనే నటించనుందని ప్రచారం జరిగింది. అయితే కబీర్ ఖాన్‌కు క్రేజీ కాంబినేషన్లు నచ్చవు. తనకు ఫైనల్‌గా అవుట్ పుట్ మాత్రమే ముఖ్యం. కేవలం పనిని మాత్రమే నమ్మకుని పనిచేసే దర్శకుడు ఆయన. హీరోయిన్ ఎంపిక కోసం కబీర్ చాలా ఆడిషన్స్ నిర్వహించడంతో దీపికాకు అవకాశం లేదన్న విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ తేల్చేసింది. దీంతో దీపిక అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.