English | Telugu

చిరు పాట‌ని చెడ‌గొట్టారు క‌దండీ..

రీమిక్స్‌లా సంప్ర‌దాయం తెలుగునాట విచ్చ‌ల‌విడిగా సాగిపోతోంది. పాట పాట‌ని తీసుకోవ‌డం, ద‌రువుల‌తో ఖూనీ చేసేయ‌డం.. మామూలైపోయింది. మెలోడీల‌నూ వేరే వేరే విధంగా భ్ర‌స్టు ప‌ట్టిస్తున్నారు. చిరంజీవి పాట‌ల్ని వాడుకోవ‌డంలో ఎవ‌రికి వాళ్లే హీరోలు. ఇది వ‌ర‌కు అల్ల‌రి న‌రేష్ ఒక్క‌డే వాడుకొనేవాడు. ఆ త‌ర‌వాత‌ రామ్‌చ‌ర‌ణ్ పోటీ కొచ్చాడు.

ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా తోడ‌య్యాడు. త‌న తాజా చిత్రం సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లో చిరు పాట‌ని రీమిక్స్ చేశారు. ఖైదీ నెం.786లోని సూప‌ర్ హిట్ గీతం గువ్వా గోరింక‌తోని ఈ సినిమా కోసం వాడుకొన్నారు. రీమిక్స్ సంప్ర‌దాయాన్ని త‌ప్పుప‌ట్ట‌లేం. కానీ బాణీని వాడుకొన్న తీరే.. శ్రోత‌ల్ని నిరాశ ప‌ర‌చ‌కూడ‌దు. గువ్వా గోరింక‌తో అనేది ఓ మ‌ధుర‌మైన మెలోడీ. బాలు, జాన‌కీలు ఈ పాట‌ని అద్భుత‌హా అన్న‌ట్టు పాడారు. అయితే మిక్కీ జే మేయ‌ర్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో సాగిన రీమిక్స్ గీతం మాత్రంలో మాత్రం ఆ మాధుర్యం కొర‌వ‌డింది.

ఇది రీమిక్స్‌లా లేదు.. పాత పాట‌నే స్టేజీ మీద పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. గాయ‌నీ గాయ‌కుల గాత్రం తేలిపోయింది. పాట‌ని చిత్రీక‌రించిన విధానం కూడా ఏమంత గొప్ప‌గా లేక‌పోవ‌డంతో చిరు ఫ్యాన్స్ నిరాశ‌లో కూరుకుపోతున్నారు. ఇక్క‌డితో ఆగుతుందా, లేదంటే చిరు పాట‌ని చెడ‌గొట్టేశారు అన్న అప‌ప్ర‌ద‌ని మూట‌గ‌ట్టుకోవాల్సివ‌స్తుందా..? ఏమో మ‌రి.. థియేట‌ర్లో సాయిధ‌ర‌మ్ స్టెప్పులైనా ఈ పాట‌ని ర‌క్షిస్తాయో, లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.